మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 మినీ వేలంలో భారత అమ్మాయిలపై కాసుల వర్షం కురిసింది. మహారాష్ట్ర ఓపెనర్ సిమ్రన్ షేక్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. తమిళనాడు బ్యాటర్ కమలిని ముంబై ఇండియన్స్ రూ.1.60 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఉత్తరఖండ్ లెగ్ స్పిన్నర్ ప్రేమ రావత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.1.20 కోట్లకు కైవసం చేసుకుంది. మినీ వేలంలో 124 మంది ప్లేయర్లు అందుబాటులో ఉండగా.. 5 ఫ్రాంఛైజీలు 19 మందిని…
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గత సీజన్ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసినందున గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.2.5 కోట్లు ఉన్నాయి. ఈసారి వేలంలో హీథర్ నైట్,…
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025కి ముందు మినీ వేలం జరగనుంది. రిటెన్షన్ లిస్టుకు తుది గడువు నవంబర్ 7 కాగా.. ఫ్రాంఛైజీలు గురువారం తాము వదులుకున్న, అట్టిపెట్టుకున్న క్రికెటర్ల జాబితాను ప్రకటించాయి. ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమా వెల్లడించింది. డబ్ల్యూపీఎల్ 2025 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు 24 మంది క్రికెటర్లను రిలీజ్ చేశాయి. 5 ఫ్రాంఛైజీలు కలిపి 71 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఇందులో 25 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.…