WPL 2025: 24 మంది క్రికెటర్లను వదిలేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఇదే!
- డబ్ల్యూపీఎల్ 2025కి ముందు మినీ వేలం
- 24 మంది క్రికెటర్లు రిలీజ్
- 71 మందిని అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025కి ముందు మినీ వేలం జరగనుంది. రిటెన్షన్ లిస్టుకు తుది గడువు నవంబర్ 7 కాగా.. ఫ్రాంఛైజీలు గురువారం తాము వదులుకున్న, అట్టిపెట్టుకున్న క్రికెటర్ల జాబితాను ప్రకటించాయి. ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమా వెల్లడించింది. డబ్ల్యూపీఎల్ 2025 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు 24 మంది క్రికెటర్లను రిలీజ్ చేశాయి. 5 ఫ్రాంఛైజీలు కలిపి 71 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఇందులో 25 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ టీమ్స్ నలుగురేసి క్రికెటర్లను రిలీజ్ చేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5, గుజరాత్ జెయింట్స్ 7 మంది క్రికెటర్లను రిలీజ్ చేశాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యషశ్రీ (యూపీ), త్రిష పూజిత (గుజరాత్)కు నిరాశ తప్పలేదు. అరుంధతి రెడ్డి (ఢిల్లీ), స్నేహ దీప్తి (ఢిల్లీ), షబ్నమ్ షకీల్ (గుజరాత్), సబ్బినేని మేఘన (బెంగళూరు), అంజలి శర్వాణి (యూపీ)ని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్ కోసం ప్రతీ జట్టు పర్స్ వాల్యూ రూ.13.25 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెరిగింది.
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
ఢిల్లీ క్యాపిటల్స్:
రిటెన్షన్ లిస్ట్: అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కప్ప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్.
రిలీజ్ లిస్ట్: లారా హారిస్, పూనమ్ యాదవ్, అపర్ణ మోండల్, అశ్వని కుమారి.
ముంబై ఇండియన్స్:
రిటెన్షన్ లిస్ట్: అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్.
రిలీజ్ లిస్ట్: ఇస్సీ వాంగ్, ఫాతిమా జాఫర్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా.
యూపీ వారియర్స్:
రిటెన్షన్ లిస్ట్: అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకనా, సైమా థాకనా.
రిలీజ్ లిస్ట్: లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవి చోప్రా, సొప్పదండి యశస్రీ.
Also Read: Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్ సీన్.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
రిటెన్షన్ లిస్ట్: స్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియో వేర్‌హమ్, శ్రేయంక పాటిల్, ఆషా శోభనా, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినక్స్, ఎక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా.
రిలీజ్ లిస్ట్: దిషా కసత్, ఇంద్రాని రాయ్, నదినే డి క్లెర్క్, శుభా సతీష్, శ్రద్దా పోకార్కర్, సిమ్రాన్ బహదుర్.
గుజరాత్ జెయింట్స్:
రిటెన్షన్ లిస్ట్: ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే.
రిలీజ్ లిస్ట్: స్నేహ రానా, క్యాథరిన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నమ్ పఠాన్,లీ తహూ.
తాజావార్తలు
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..