WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం…
గత 15 ఏళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమెన్స్ ఐపీఎల్ కోసం చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. అది ఇప్పటికి నిజం కాబోతుంది.