Rohir Sharma: దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన చివరి టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అతడు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ డకౌట్‌గా వెనుతిరగడం ఇది 43వ సారి. దీంతో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు సున్నా స్కోరుకే అవుటైన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. గతంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరుతో ఈ రికార్డు ఉండేది. అతడు 42…
Team India: మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. దీంతో భారత్ ఖాతాలో మరో ఓటమి చేరింది. గత నాలుగు టీ20లలో భారత్‌కు ఇది మూడో పరాజయం కావడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా తాజా ఓటమితో స్వదేశంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు టీ20 మ్యాచ్‌లలో 200 ప్లస్ టార్గెట్‌లను డిఫెండ్ చేసుకోవడంలో విఫలమైన తొలి జట్టుగా టీమిండియా చెత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది జూన్ నెలలో…
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లలో సున్నా పరుగులకే అవుటైన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడిన కోహ్లీ మధుశంక బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసి ఊపు…
టీ20 మ్యాచ్‌లలో బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాటింగ్ చేసేవాళ్లు సిక్సులు, ఫోర్ల బాదడమే పనిగా పెట్టుకోవడంతో బౌలర్లు చెత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మెకరైన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ టీ20 2022 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా సోమర్‌సెట్, డెర్బీషైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన డెర్బీషైర్ మెకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. తన…
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారిగా 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లీష్ జట్టు మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే కొట్టేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల ఆధిక్యాన్ని పొంది టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా…
ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. ముంబై జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం ముంబై జట్టుపై భారీగా…
గురువారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 14 సార్లు రోహిత్ డకౌట్ అయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధికంగా 13 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో పీయూష్ చావ్లా, హర్భజన్, మన్‌దీప్ సింగ్, పార్థివ్ పటేల్, రహానే, అంబటి…
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పటిష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. ఓటముల్లో కూడా రికార్డులు నెలకొల్పుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతూనే వస్తోంది. తాజాగా ఈ సీజన్ ఐపీఎల్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. దీంతో…
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ 45 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును రోహిత్ క్రాస్ చేశాడు. అలాగే…
క్రికెట్ ఏ జట్టు అయినా టెస్టు ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకే టెస్టుల్లో అన్ని జట్లు రాణించాలని తాపత్రయపడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టుకు టెస్టుల్లో పెద్దగా కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ ఉన్నా ఆ జట్టు చతికిలపడింది. దీంతో ఇంగ్లండ్ టెస్ట్ టీం అత్యంత గడ్డుకాలంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 2021లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. Read Also: IND Vs SA:…