అమెరికాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత లేనప్పటికీ మతపరమైన కారణాలు, ఇతర సొంత కారణాల వలన వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై వివక్ష మొదలైంది. ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కొన్ని ట్యాక్సీ సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చారు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు ఆఫ్ఘన్‌లో అరాచక పాలన సృష్టించారు. ఈ పాలన తరువాత, అమెరికా దళాలు ఆఫ్ఘన్‌లోని ముష్కరులపై దాడులు చేసి తాలిబన్లను తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. 20 ఏళ్లపాటు అమెరికా, నాటో దళాలు అక్కడే ఉన్నాయి. 2021 ఆగస్టు 31 వరకు పూర్తిగా అమెరికన్ దళాలు ఆఫ్ఘన్‌ను వదలి వెళ్లిపోయాయి. దీంతో మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు…
ప్రపంచంలో ఇప్పటికే 700 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నది. ఎక్కువ జనాభా ఆసియా దేశాల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఉన్న జనాభాకు కావాల్సిన మౌళిక వసతులు, ఆహారం, ఉద్యోగాల కల్పన సరిగా అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లల్ని కనడంపై కంటే, కెరీర్‌పైనే ప్రజలు ఎక్కువగా దృష్టిసారించారు. దీంతో అనేక దేశాల్లో జననాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. కరోనా మహమ్మారి ప్రభావం కూడా జననాల సంఖ్యపై…
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 లక్షల…
అందం అనగానే అందరూ ఆడవాళ్ల గురించే మాట్లాడేస్తుంటారు. మరి మగవాళ్ల ఆందం సంగతేంటి? అదే అనుమానం వచ్చి ఓ బ్యూటీ వెబ్ సైట్ లోతైన అధ్యయనం జరిపిందట! అందులో తేలింది ఏంటంటే… బీటీఎస్ పాప్ బ్యాండ్ లోని సింగర్ ‘జిన్’ ప్రపంచంలోనే అత్యంత అందగాడట!కిమ్ సియోక్ జిన్ పూర్తి పేరైతే అందరూ ‘జిన్’ అని షార్ట్ గా పిలుస్తారు ఈ కొరియన్ సెన్సేషనల్ సింగర్ ని. మొత్తం ఏడుగురు గాయకుల బీటీఎస్ టీమ్ లో జిన్ కూడా…
కరోనా కేసులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్నా, మరికొన్ని చోట్ల భారీగా నమోదవుతున్నాయి. వివిధ దేశాల్లో వివిధ రకాలైన వేరియంట్లు నమోదవుతున్నసంగతి తెలిసిందే. ఆల్పా, బీటా, గామా వేరియంట్లు నమోదైనా వీటిలో ఆల్ఫా వేరియంట్ కేసులు అత్యధికం. అయితే, ఇండియాలో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్‌లు ఆల్ఫా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. డెల్టా వేరియంట్ కారణంగా ఇండియాలో రోజూ వేలాది కేసులు, మరణాలు సంభవించాయి. ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా మరణాల కంటే, ఆకలి చావులే అధికంగా ఉన్నట్టు ఆక్సోఫామ్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఆక్సోఫామ్ సంస్థ పేదరిక నిర్మూలనకోసం పనిచేస్తున్నది. వైరస్ కారణంగా ప్రపంచంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వివిధ దేశాల్లో అంతర్గత సమస్యలు, అంతర్గత ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. Read:…
ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా, అది చేయాల్సి విద్వంసం చేసేసింది. కరోనా మహమ్మారి ధాటికి యూరప్ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటిస్ఠానంలో ఉండే యూరప్ దేశాలు ఈసారి వాటి స్థానలను కోల్పోయాయి. ఇక, కరోన కట్టడి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి కరోనాకు చెక్ పెట్టిన న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో…
భారత దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యపించింది. ప్రపంచంలోని 53 దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. ఇండియాలో ఈ డబుల్ మ్యూటేషన్ వేరింట్ కారణంగా పాజిటీవ్ కేసులు, అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వేరియంట్ చెక్ పెట్టేందుకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను అందించారు. జూన్ నుంచి ఈ…