సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… అన్ని దేశాలు అంక్షలు విధించినా క్రమంగా విస్తరిస్తూనే ఉంది… జట్ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసే పనిలోపడిపోయింది.. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్ బారినపడి ఎవ్వరూ మృతిచెందకపోవడం ఊరట కలిగించే విషయమే.. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఈ వేరియంట్ ఆందోళనకరమేనని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో.. అయితే ఇప్పటి ఈ మహమ్మారితో ఎవరూ ప్రాణాలు వదలలేదని పేర్కొంది..…
కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా దాడి చేస్తూనే ఉంది.. తాజాగా సౌతాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్.. జెట్ స్పీడ్‌తో ఎటాక్ చేస్తోంది.. కేవలం నాలుగు రోజుల్లోనే 14 దేశాలను తాకేసింది.. దీంతో, అప్రమత్తమైన దేశాలు.. ఆంక్షలు విధిస్తున్నాయి… ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌వో) కీలక వ్యాఖ్యలు చేసింది… కొత్త వేరియంట్ B.1.1.529 ప్రభావాన్ని మదింపు చేసేందుకు కొంత సమయం పడుతుందని.. కొద్ది వారాల తర్వాత దాని ప్రభావాన్ని మదింపు చేయగలమని పేర్కొంది.. అయితే,…
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన…
కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయాన్ని గత కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైంది.. మరో 24 గంటల్లోగా కోవాగ్జిన్‌పై గుడ్‌న్యూస్ చెబుతాం అంటున్నారు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు సంబంధించిన మరింత డేటాను భారత్ బయోటెక్.. డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది.. దీనిపై ఇవాళ డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా.. 24 గంటల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం…
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిన సమయంలో.. మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయని ఆశగా ఎదురుచూశారు.. కానీ, కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఆ తర్వాత రష్యా, యూకే, అమెరికా.. ఇలా పలు దేశాల్లో క్రమంగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని,…
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతున్న వేళ.. డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దీంతో భారత్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభినందించారు. 100 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను టెడ్రోస్ అథనోమ్ రీట్వీట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ ప్రజలను…
కరోనా మహమ్మారి చైనాలో పుట్టింది..! ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది అనే ప్రచారం ఆది నుంచి జరుగుతోంది.. అది కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అంటూ.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం వివాదాస్పంగా మారింది. ఇక, చైనాపై ప్రతీఒక్కరు దుమ్మెత్తిపోశారు.. సోషల్ మీడియా చైనాను ఓ ఆటాడుకుంది.. అంతేకాదు.. కోవిడ్ ఆనవాళ్లపై ఇప్పటికే చైనాలో కూడా పర్యటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం.. కానీ, కోవిడ్ 19 చైనానే పుట్టింది అనే…
కరోనా మహమ్మారి కట్టడికోసం ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రపంచదేశాలతో పాటు.. భారత్‌లో కూడా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇప్పటికే దేశ్యాప్తంగా 62.29 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది భారత్.. ఇక, శుక్రవారం ఒకేరోజు కోటి డోసులు వేసి.. మరో అరుదైన ఘనత సాధించారు.. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు తెలిపింది.. భారత్‌లో ఒకేరోజు కోటి మందికి వ్యాక్సినేషన్‌పై సంతోషాన్ని వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్.. సోషల్ మీడియా వేదికగా…
ఇప్పటికే కరోనా వైరస్ కలవరపెడుతోంది.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. మరోవైపు.. పాజిటివ్ కేసులు అదుపులోకి వచ్చినట్టే కనిపించడం లేదు.. ఈ తరుణంలో మరో కొత్త వైరస్ ఇప్పుడు కలవరడానికి గురిచేస్తోంది.. ఆఫ్రికా దేశం గినియాలో మార్‌బర్గ్ అనే వ్యాధి బయటపడింది.. ఎబోలా, కోవిడ్ లాంటి వైరస్‌ల తరహాలోనే మార్‌బర్గ్ కూడా ప్రాణాంతమైందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…