కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా, అప్పటి గాయాలు చాలా మందిని ఇంకా వెంటాడుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొవిడ్ వచ్చినప్పుడు చాలా మంది బతకాలనే ఆశతో ఆస్తులను అమ్మి వైద్యం చేయించుకున్నారని, కానీ ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఇంకా ఎందుకు బతికున్నామా అని ఇప్పుడు కుమిలిపోతున్నారని ఆయన అన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ రోజున ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ రోజును జరుపుకుంటారు.