బ్రిటన్‌కు చెందిన 18 నెలల బాలిక ఒపాల్ శాండీ చరిత్ర సృష్టించింది. జీన్ థెరపీ ద్వారా బాలిక చెవిటితనాన్ని శాశ్వతంగా నయం చేశారు. ఈ థెరపీ ద్వారా మళ్లీ వినగలిగే ప్రపంచంలోనే మొదటి బిడ్డ ఆమె. ఈ చారిత్రాత్మక విజయంతో ఇకపై చెవిటి వ్యాధికి సులభంగా చికిత్స అందుతుందని వైద్యులు తెలిపారు. ఈ థెరపీ ఒక మైలురాయిగా నిరూపించబడింది.