దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఫెర్రీ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లో మరో యూనిట్ నెలకొల్పేందుకు రూ. 500 కోట్లు పెట్టుబడి చేసేందుకు అంగీకారం తెలిపిందని మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు. బుధవారం ఫెర్రీ ఫార్మా ప్రతినిధులతో సమావేశమైన తర్వాత, ఈ శుభవార్తను కేటీఆర్ తెలియజేశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్రెర్రింగ్ ఫార్మా గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫార్ములేటింగ్ సెంటర్‌ను నెలకొల్పేందుకు రూ. 500…