ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ సెమీఫైనల్ కు చేరే జట్ల గురించి చెప్పేశాడు. నవంబర్ 15, 16న జరిగే తొలి, రెండో సెమీ ఫైనల్ కి చేరే నాలుగు జట్లు ఏవో తేల్చి చెప్పేశాడు. అందులో భారత్ ఉండగా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు చేరే అవకాశం ఉందని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.
ఇండియా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. అక్టోబర్ 15న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
వచ్చే సంవత్సరం వెస్టిండీస్–అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా టీమ్ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఇవాళ (శుక్రవారం) ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
దేశం మొత్తం ఎవరి పునరాగమనం కోసం ఏడాది పాటు ఎదురుచూస్తుందో.. వారు స్టేడియంలో కనిపించనున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ప్రపంచ కప్‌కు ముందు అతను నెట్స్‌లో బౌలింగ్ చేయడమనేది టీమిండియాకు మంచి సంకేతం. కొన్ని వార్త కథనాల ప్రకారం.. బుమ్రా నెట్స్‌లో 8 నుండి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు.
అయితే ఇది సాధ్యం కావాలంటే.. ఒకట్రెండు మ్యాచ్ ల్లో ఆడితే సరిపోదు.. నెలన్నర రోజుల పాటు క్రికెటర్స్ తమ బెస్ట్ ఇవ్వాలి.. ముఖ్యంగా నాకౌట్ దశలో సత్తా చాటాలి.. అప్పుడే భారత జట్టు ఖాతాలో మరో ప్రపంచకప్ వచ్చి చేరుతుంది. గత ఏడాది కాలంగా టీమిండియాను ఒక సమస్య తీవ్రంగా కలిచివేస్తోంది. గతేడాది ఆసియా కప్ నుంచి ఈ సమస్య మరీ ఎక్కువైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాకు ఇది అతి పెద్ద మైనస్ గా…
ప్రపంచకప్‌లో భారత్ నంబర్-4 బ్యాట్స్‌మెన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. శ్రేయాస్ అయ్యర్ ఈ నంబర్‌లో ఆడాల్సి ఉంది. కానీ అతను ప్రస్తుతం గాయంతో ఉన్నాడు. అతను ఎప్పుడు తిరిగి ఫిట్‌గా అవుతాడనేది తెలియడంలేదు. మరోవైపు ప్రపంచ కప్ కోసం భారత జట్టులో టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల స్థానం స్థిరంగా ఉంది. నాలుగో నెంబర్ లో శ్రేయస్ లాంటి మంచి బ్యాట్స్…
భారత్‌లో జరగనున్న వన్డే క్రికెట్ ప్రపంచకప్‌కు శ్రీలంక తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో జింబాబ్వేను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక ఈ ఘనత సాధించింది. బులవాయోలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకకు ఆతిథ్య జట్టు ఇచ్చిన 166 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ పాతుమ్ నిశాంక అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2023 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్-నవంబర్‌లో 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు పాకిస్థాన్ భారత్‌కు వచ్చే దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా బోర్డు పాకిస్థాన్ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు వేసింది. అయితే ఆ సమాధానాలు వచ్చిన తర్వాతే పాకిస్తాన్ భారతదేశానికి వచ్చేట్లుగా తెలుస్తుంది.
తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్‌లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు అని పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ర్యాంకింగ్స్‌లో పడిపోయిన మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈసారి క్వాలిఫయర్స్ ద్వారా ప్రధాన టోర్నీకి ముందడుగు వేయాల్సి ఉంటుంది. వచ్చేనెల ( జూన్ ) 18 నుంచి జూలై 9 వరకు జింబాబ్వేలో క్వాలిఫయింగ్ టోర్నమెంట్ జరుగుతుంది.