భారత్‌లో జరగనున్న వన్డే క్రికెట్ ప్రపంచకప్‌కు శ్రీలంక తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో జింబాబ్వేను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక ఈ ఘనత సాధించింది. బులవాయోలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకకు ఆతిథ్య జట్టు ఇచ్చిన 166 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ పాతుమ్ నిశాంక అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. 102 బంతులు ఎదుర్కొన్న పాతుమ్ 14 ఫోర్లతో అజేయంగా 101 పరుగులు చేశాడు. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ దిముత్ కరుణరత్నే 30, కుశాల్ మెండిస్ 25 పరుగులు చేశారు. నాలుగు వికెట్లు తీసిన స్పిన్నర్ మహిష్ తీక్షణ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
Revanth Reddy: ఈ డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సీన్ విలియమ్స్ జింబాబ్వే తరఫున అత్యధిక ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు మరియు ఒక సిక్స్ ఉన్నాయి. అదే సమయంలో సికందర్ కూడా 31 పరుగులు చేశాడు. శ్రీలంక తరుపున స్పిన్నర్ మహిష్ తిక్షణ నాలుగు వికెట్లు తీయగా.., ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు తీశారు. మతిషా పతిరనా కూడా ఇద్దరు ఆటగాళ్లను ఔట్ చేశాడు. జింబాబ్వే జట్టు కేవలం 39 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.
MayaBazaar For Sale: రియల్ మోసం.. అడ్డంగా ఇరుక్కున్న నవదీప్
భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో మొత్తం పది జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ టోర్నీకి ఎనిమిది జట్లు తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు టోర్నమెంట్‌లోకి ప్రవేశిస్తాయి. ఇప్పుడు శ్రీలంక జట్టు ప్రపంచకప్‌కు తన స్థానాన్ని ధృవీకరించింది. ఇంకా మూడు జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్ మరియు స్కాట్లాండ్ మిగిలిన ఒక స్థానం కోసం రేసులో ఉన్నాయి. జింబాబ్వే తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను ఓడించినట్లయితే.. వారు కూడా ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తార. లేకుంటే నెట్ రన్‌రేట్ ప్రకారం క్వాలిఫై అవుతారా లేదా అనేది తేలుతుంది. మరోవైపు సూపర్-సిక్స్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకు భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. అందుకు శ్రీలంక జట్టు అర్హత సాధించింది.