టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు భారత్-అమెరికా మధ్య మ్యా్చ్ జరుగుతుంది. న్యూయార్క్లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో అమెరికా తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు పరుగులు చేయనీయకుండా కట్టడి చేశారు. భారత్ ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది అమెరికా. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. సూపర్-8లోకి ఎంట్రీ ఇస్తుంది.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ఇండియా-అమెరికా జట్ల మధ్య మ్యా్చ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. టీమిండియా సూపర్-8లోకి ఎంటర్ కానుంది.
న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు దాయాదుల సమరం మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసమని కొత్తగా నిర్మించిన నసావు స్టేడియంలో నేడు భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కల్గి ఉన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్ కు స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశముంది. టిక్కెట్ల భారీ…
టీ20 ప్రపంచకప్ ( టీ20 ప్రపంచకప్ 2024 )లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9వ తేదీకి అంటే ఆదివారానికి వాయిదా పడింది. అయితే మెగా మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మాజీ వెటరన్ టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యకరం. మెగా మ్యాచ్‌లో టీమిండియా గట్టి పోటీదారు అని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు.
2024 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ ను గెలిచింది. గురువారం ఒమన్‌తో బార్బడోస్ లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో) అలాగే బౌలింగ్ లో (3-0-19-3) విధ్వంసక నాక్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి…
Afghanistan Squad for World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. ఊహించని ఇద్దరు ఆటగాళ్లకు అఫ్గాన్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 19 ఏళ్ల యువ వికెట్ కీపర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు అనూహ్యంగా చోటు దక్కింది. అఫ్గాన్ 15 మంది…
ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకంను కైవసం చేసుకుంది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. Also Read: Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే:…
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈరోజు (సోమవారం) U19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇంతకుముందు.. ఈ టోర్నమెంట్ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్ లో.. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, నమీబియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నేపాల్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిపి 16 జట్లు…
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.
T20 World Cup 2024 set to be played from June 4: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలలో భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముహూర్తం ఖారారు చేసినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనున్నట్లు ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో…