World Bank: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యానికి చేరువులో ఉందని సాక్షాత్తూ వరల్డ్ బ్యాంకే ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం, రుణాల భారం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు.