Bengaluru Water crisis: వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు.. కోవిడ్‌ని గుర్తు చేస్తున్న బెంగళూర్ నీటి సంక్షోభం..బెంగళూర్ వాసులకు నీటి కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎండలు పూర్తిగా ముదరకముందే సిలికాన్ వ్యాలీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ కష్టపడుతోంది. ఇప్పటికే చాలా వరకు అపార్ట్‌మెంట్లలో నీరు లేదు. దీంతో వారంతా డిస్పోజబుల్ ప్లేట్లను, వెట్ వైప్‌లను వాడుతున్నారు. మరికొందరు సమీపంలోని మాల్స్‌లకి కస్టమర్లలా వెళ్లి కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. మరో మూడు నాలుగు…
Byju’s : ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సమస్యలు తగ్గుముఖం పట్టడం లేదు. నగదు కొరతను అధిగమించడానికి కంపెనీ మొదట హక్కుల జారీ ద్వారా డబ్బును సేకరించింది.
కరోనా వేగంగా ప్రభలుతున్న సమయంలో ఐటీ కంపెనీలు అన్ని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల బలవంతంగా ఆఫీస్ లకు రావాలని కొత్త రూల్స్ పెట్టింది.. కొన్ని కంపెనీలు ఉద్యోగుల పై కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితల్లో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది..…
TCS: కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ సమస్య సమిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. వర్క్ కల్చర్ మెరుగుపరిచేందుకు, భద్రత దృష్ట్యా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, లేకపోతే కెరీర్ పరిమితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.
కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. కొన్ని రాష్ట్రాల్లో కఠినమైన నిబంధనలను పాటించేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐటి కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఈ మేరకు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో కూడా వర్క్ ఫ్రమ్ అని చెప్పింది..హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు…
TCS: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్‌ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
Infosys: కరోనా మహమ్మారి ముగిసిపోవడంతో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి పలు ఐటీ సంస్థలు. ఇదిలా ఉంటే కొన్ని సంస్థలు వారానికి మూడు రోజులైన ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. హైబ్రీడ్ విధానంలో పనిచేయాలని సూచిస్తున్నాయి.
Amazon: కోవిడ్ మహమ్మారి సమయంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) సదుపాయాన్ని కల్పించాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పనిచేయాల్సిందిగా కోరాయి. అయితే కరోనా ప్రభావం తగ్గి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎత్తేస్తున్నాయి.