Fake Messages: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మెసేజ్.. స్పందించారో దోచేస్తారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Messages: నిరుద్యోగ యువతే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వారికి గాలం వేస్తూ వేలల్లో దోచుకుంటున్నారు. దీనికి ఆకర్షితులైన యువత డబ్బులు పోగొట్టుకుని లబోదిబో మంటా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనల్లో ఏది నిజమో, ఏది నకిలీదో తెలియని గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఉద్యోగం కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ ఉచ్చులో పడుతున్నారు.
ఇటీవల ఓ యువతిని వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నకిలీ వెబ్‌సైట్ లింక్‌ను పంపడం ద్వారా సుమారు రూ. లక్ష వరకు చెల్లించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నిజాంపేటకు చెందిన నవ్యశ్రీ అనే యువతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఈనెల 2న నవ్యశ్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ జాబ్ పేరుతో లింక్ పంపాడు. లింక్ ఓపెన్ చేసి కొన్ని పనులు చేస్తే డబ్బులు వస్తాయని నమ్ముతున్నారు. నిజమే అనుకున్న నవ్యశ్రీ లింక్ ఓపెన్ చేసి వారు ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేసింది. అయితే దీని కోసం ముందుగా కొంత డబ్బు చెల్లించాలని, తాము చెల్లించిన దానికంటే ఎక్కువ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అది నిజమని నమ్మిన యువతి మొత్తం రూ. ఆలోచించకుండా ఏడు విడతల్లో రూ.91,100 ఆమె ఖాతా నుంచి పంపించారు. డబ్బు పంపిన తర్వాత అవతలి వైపు నుంచి వచ్చిన స్పందన ఒక్కసారిగా షాక్ తిన్నారు.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
Read also: Palakurthy Thikkareddy: అందరికీ అండగా ఉండాలనే లోకేష్ శంఖారావం పూరించబోతున్నారు..
అంతకు రెట్టింపు ఇస్తామని చెప్పిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. తాను పంపిన డబ్బును వెంటనే వెనక్కి పంపాలని కోరింది. అవతలి వ్యక్తి రూ.83 వేలు పన్ను చెల్లిస్తే తిరిగి ఖాతాలో డబ్బులు వస్తాయని బదులిచ్చారు. మోసపోయానని భావించిన బాధితురాలు అదే రోజు సైబర్ క్రైమ్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. ఉద్యోగం కోసం వెతుకులాటలో చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా కోల్పోయే దుస్థితి నెలకొంది. అందుకే తస్మాత్ జాగ్రత్త! వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్న యువతీ, యువకులు తాము చూసే ఆకర్షణీయమైన ప్రకటనలన్నీ నిజమేనని నమ్మి మోసపోకూడదని సూచించారు.
PM MODI: బీజేపీకి ఒంటరిగానే 370 పైగా ఎంపీ సీట్లను గెలుస్తుంది..
తాజావార్తలు
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?