ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా సరికొత రికార్డు సృష్టించింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6) మెరుపు సెంచరీతో.. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే 331 పరుగులు సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్…
Ind vs Aus : విశాఖ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆసీస్ మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 49 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. ముందుగా టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక…
Womens World Cup 2025 : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకుంది. ఉమెన్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో మంధాన 5 వేల పరుగుల మైలురాయిని దాటింది. దీంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించిన భారత మహిళా ఆటగాళ్లలో మిథాలి రాజ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మంధాన ఆ జాబితాలో రెండో…
ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించింది. గురువారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో రిచా 77 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసింది. రిచా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత జట్టు 251 పరుగులు చేసింది. 102/6తో పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న జట్టును రిచా ఒంటిచేత్తో ఆడుకుంది. ఓ దశలో భారత్ 150 పరుగులైనా చేస్తుందా అని…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో భారత్ బ్యాటింగ్ ముగిసింది. 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. కష్టాల్లో పడిన జట్టును రిచా ఘోష్ (94; 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడుకుంది. అయితే తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరలో స్నేహ్ రాణా (33) ధాటిగా ఆడింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23)లు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.…
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా బుధవారం కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. 222 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 36.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయి.. 107 పరుగుల భారీ తేడాతో ఓడింది. దాంతో మెగా టోర్నీలో పాకిస్థాన్ హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు 28 ఏళ్లలో ఆస్ట్రేలియాను వన్డేలో ఓడించలేదు. రెండు జట్లు ఇప్పటివరకు 18 వన్డేలు ఆడాయి కానీ.. పాక్ ఒక్క విజయం…
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. జగన్ పర్యటన రోజే విశాఖలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్ అవుతుందని, రోడ్ బ్లాక్ అయితే తమిళనాడులో దళపతి విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ…
Women World Cup 2025 : మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ఫామ్ కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లను సాధించి, టోర్నమెంట్ పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మధ్యలో బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. హర్లీన్ డియోల్…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఆసియా కప్ 2025లో పురుషుల జట్టు మాదిరే.. ఈ మ్యాచ్‌లోనూ మహిళలు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగిన భారత మహిళలు.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటుతున్నారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాక్ ఐదు కీలక వికెట్స్ కోల్పోయి పరాజయం దిశగా సాగుతోంది. పాక్ 31 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ ప్రక్రియ వివాదంకు తెరలేపింది. మ్యాచ్‌లో టాస్ సందర్భంగా రిఫరీ సహా వ్యాఖ్యాత పెద్ద తప్పిదం చేశారు. తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న పాక్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ రిఫరీ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉందని ఫాన్స్ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి…