కెరీర్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత్ స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. శనివారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ 50 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 7-0 తేడాతో మీనాక్షి (హరియాణా)పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పసిడి నెగ్గి దూకుడు మీదున్న ఈ తెలంగాణ బాక్సర్.. కొత్తగా 50 కేజీల విభాగంలోనూ అదరగొట్టింది. బౌట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. ”…
నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వకారణం అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయని అన్నారు. జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపించనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడలు,క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రోత్సహిస్తున్నది చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనమని..నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైన జరీన్ కు వ్యక్తిగతంగా…