Commonwealth games: కామన్వెల్త్ గేమ్స్‌కు తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత్ స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. శనివారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ 50 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 7-0 తేడాతో మీనాక్షి (హరియాణా)పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పసిడి నెగ్గి దూకుడు మీదున్న ఈ తెలంగాణ బాక్సర్.. కొత్తగా 50 కేజీల విభాగంలోనూ అదరగొట్టింది. బౌట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది.
” తిరిగి నా లయ అందుకోవడానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే వరల్డ్ చాంపియన్‌షిప్స్ తర్వాత నేను ప్రాక్టీస్ చేయలేదు. ఇంటికి వెళ్లి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తో పోలిస్తే ఈ ట్రయల్స్‌లో 50 శాతం ప్రదర్శన కూడా చేయలేదని తెలుసు. అయినప్పటికీ నా ప్రత్యర్థులందరిపై ఏకపక్ష విజయాలు సాధించా. నేనెప్పుడూ పోటీపడే బరువు విభాగం ఇది కాదు. దీనికి తగ్గట్లుగా మారేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉంది. అలసట నుంచి కోలుకునేందుకు కొన్ని రోజుల విశ్రాంతి తీసుకుని నా సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఫోకస్ పెడతా” అని విజయానంతరం నిఖత్ తెలిపింది.
Also Read
- Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై 'కింగ్' కోహ్లీ కన్ను!
- Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
- Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
- Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా (70 కేజీలు).. పూజ (రైల్వేస్)పై నెగ్గి కామన్వెల్త్ బెర్త్ సాధించింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత దీని కోసం ఎంతో కష్టపడ్డా. టోక్యోలో పసిడి నెగ్గాలనుకున్నా కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారిద్దామనుకుంటే బయట కార్యక్రమాల కారణంగా సమయం దొరకలేదు. ఎన్నో సన్మాన, ఇతర కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ రాలేను అని చెబితే పతకం గెలవగానే అహం పెరిగిందని అనుకుంటారని వెళ్లాల్సి వచ్చింది. దీంతో ప్రాక్టీస్ దెబ్బతింది. అది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ప్రభావం చూపింది” అని లవ్లీనా పేర్కొంది.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?