ఏపీ ఎన్జీఓ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ప్రత్యేక సమస్యలు మాకు అర్ధమౌతాయని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పూర్తిస్థాయిలో వస్తుందని ఆమె వెల్లడించారు. ఇటీవల మహిళా ఉద్యోగులు డిప్రెషన్ కు లోనవుతున్నారని, మహిళలు బలంగా తయారవ్వాలని ఆమె కోరారు. గత ప్రభుత్వాలలో మహిళలకు జరిగిందేమిటని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగినదేమిటి మహిళలు గుర్తించాలని ఆమె…
మహిళ..నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.. తల్లిగా, భార్యగా, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూనే అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. ఇక పోలీస్ ఉద్యోగం అంటే కేసులు, క్రైమ్ లు.. రోజూ డ్యూటీ.. కనీసం వారికి బయటికి వెళ్లే సమయం కూడా ఉండదు. దీంతో ఒక్కరోజు ఆ మహిళా సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్‌లో ఈ…
ఈరోజు మహిళా దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు అధికారులు. మొట్టమొదటిసారిగా మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించారు. మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సిఐ కి బాధ్యతలు అప్పగించనున్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్…