ఆసియా క్రీడలు 2023 మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయాన్ని చాలా స్పెషల్‌గా అభివర్ణిస్తూ.. జాతీయ గీతాలాపన సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.