Bus Accident: విశాఖపట్నంలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు కు ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్ ను ముగించుకొని బరోడా జట్టు ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో తాటి చెట్ల పాలెం జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సుకి ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
Read Also: DCM Larry Accident: డీసీఎంను ఢీకొట్టిన లారీ.. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన ఇద్దరు
బస్సులో ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. ఈ నెల 11 నుంచి విశాఖలో మహిళల సీనియర్ టి20 మ్యాచ్ ప్రారంభమైంది.