మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్ డే. ఆధునిక ఏపీ లో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులే. స్టేజి మీద కాదు …స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ సాధికారతకు ప్రతినిధులుగా ఉన్న మహిళలే. మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్ రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయి. మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం…
ఈరోజు మహిళా దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు అధికారులు. మొట్టమొదటిసారిగా మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించారు. మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సిఐ కి బాధ్యతలు అప్పగించనున్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్…