బీహార్ రాజధాని పాట్నాలో సుందరవతి అనే కళాశాల ఉంది. పాట్నాలోని ఆ మహిళల కళాశాలకు మంచి పేరు ఉంది. ఈ కాలేజీలో 1500 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఇప్పుడు ఈ కాలేజీ యాజమాన్యం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కాలేజీకి వచ్చే విద్యార్థినులు తప్పని సరిగా జడ వేసుకొని రావాలని, లూజ్ హెయిర్‌తో వస్తే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, సెల్ఫీలు దగడంపై నిషేదం విధించారు. దీంతో పాటుగా డ్రెస్‌కోడ్‌ను కూడా తీసుకురావడంతో స్టూడెంట్స్ ఆగ్రహం…