TG SET 2024 : లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అవసరమైన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీజీ సెట్ 2024 ఫలితాలను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో కలిసి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. పరీక్షకు మొత్తం 33వేల 494 మంది దరఖాస్తు చేసుకోగా 26వేల 294 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1884 మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 7.17శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా ఇందులోనూ మహిళా అభ్యర్థులు 49.79శాతం కాగా పురుషులు 50.21 శాతం మంది అర్హత సాధించారు. ఫలితాలకోసం అభ్యర్థులు TGSET అధికారిక వెబ్‌సైట్ [www.telanganaset.org]లో చూసుకోవచ్చని సభ్యకార్యదర్శి ఆచార్య నరేష్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయటం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని వెల్లడించారు.
Minister Kandula Durgesh: తెలుగు భాషను కాపాడుకుందాం.. మన సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం