Crime: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబిలో ఒక వివాహిత మహిళను సొంత బంధువైన వ్యక్తి కాల్చి చంపాడు. తన కోరికలను తిరస్కరించిన కారణంగా గురువారం ఉదయం 24 ఏళ్ల మహిళను చంపాడు. గత కొంత కాలంగా మహిళపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో కోపం పెంచుకున్న వ్యక్తి ఆమెను చంపేశాడు. బాధితురాలిని పోలీసులు దీపికా తివారీగా గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భర్త, పిల్లలతో బైక్‌పై వెళ్తున్న మహిళపై దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా ఛాతీలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.