Prank Goes Wrong: స్నేహితుడితో సరదా కోసం చేసిన పని మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన ముంబైలో మంగళవారం జరిగింది. మూడో అంతస్తులో గోడపై కూర్చున్న మహిళను ఆటపట్టిద్దామని చూసిన వ్యక్తి, ఆ మహిళను నెట్టివేయడం వీడియోలో చూడొచ్చు. వెంటనే పట్టు కోల్పోయిన మహిళ అక్కడ నుంచి జారిపడి ప్రాణాలు పోగొట్టుకుంది.