Prank Goes Wrong: ప్రాంక్ ప్రాణాలు తీసింది.. మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. వీడియో వైరల్..
- ప్రాంక్ ప్రాణాలు తీసింది..
- మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prank Goes Wrong: స్నేహితుడితో సరదా కోసం చేసిన పని మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన ముంబైలో మంగళవారం జరిగింది. మూడో అంతస్తులో గోడపై కూర్చున్న మహిళను ఆటపట్టిద్దామని చూసిన వ్యక్తి, ఆ మహిళను నెట్టివేయడం వీడియోలో చూడొచ్చు. వెంటనే పట్టు కోల్పోయిన మహిళ అక్కడ నుంచి జారిపడి ప్రాణాలు పోగొట్టుకుంది. ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read Also: Kerala: విదేశీ మహిళకు పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశం నిరాకరణ.. వివాదాస్పదమైన ఘటన..
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
చనిపోయిన బాధిత మహిళను నాగినా దేవీ మంజీరామ్‌గా గుర్తించారు. ఆమె మూడో ఫ్లోర్ నుంచి పడిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళ గ్లోబ్ స్టేట్ కాంప్లెక్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తోంది. ఆమె సహోద్యోగుల బృందంతో పాటు నాగినా దేశి కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఆ సమయంలో లాబీలోని బాల్కానీ గోడపై ఆమె కూర్చుని ఉంది. ఆ సమయంలో బంటీ అనే వ్యక్తి తమాషాగా నెట్టివేస్తున్నట్లు ప్రాంక్ చేద్దామని చూశాడు. అయితే, దురదృష్టవశాత్తు మహిళ అక్కడ నుంచి పడిపోయింది, పడిపోతున్న క్రమంలో ఆమెను బంటీ పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనలో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Woman falls off third floor of a complex in Maharashtra's Dombivli.
This happened while the woman was with her friends. Another of her friends was saved by bystanders.
The woman was identified as Gudiya Devi, who worked as a cleaner in the building. She is survived by a son… pic.twitter.com/tfKpjHFn4U
— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!