పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ వివాహ కార్యక్రమంలో పాట పాడుతూ ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మహిళ పాడుతున్న మైక్‌లో కరెంట్ ప్రవాహం పెరగడంతో ఆమె మరణానికి దారితీసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.