Today Stock Market Roundup 28-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని అద్భుతమైన ఫలితాలతో ముగించింది. చివరి రోజైన ఇవాళ శుక్రవారం రెండు కీలక సూచీలు అనూహ్యంగా అత్యధిక విలువలను అందుకోవటం విశేషం. విదేశీ మరియు స్వదేశీ కొనుగోళ్లు కలిసొచ్చాయి. రిలయెన్స్, ఐటీసీ, కొటక్, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థలు రాణించాయి.