మీరు సీఎం..సీఎం అంటే నాకు భయం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు.
ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది..జనసైనికులే అని పేర్కొన్నారు.