Wife Killed Husband: నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్త శీనయ్యను భార్య ధనమ్మ కరెంట్ వైరుతో గొంతు బిగించి చంపేసింది. ఇక, భార్య ధనమ్మతో పాటు ప్రియుడు కల్యాణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Wife Kills Husband: దేశవ్యాప్తంగా వరుసగా భర్తలను చంపిన భార్యల కేసులు నమోదవుతున్నవేళ.. సరిగ్గా అలాంటి ఘటనే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వెలుగులోకి వచ్చింది. భర్తను కూల్‌గా చంపేందుకు కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపింది. ఆస్పత్రిలో రెండు రోజులపాటు అతడు పోరాడి చనిపోయాడు. ఈ ఘటన వర్ధన్నపేటలోని భవానికుంట తండాలో సంచలనం సృష్టించింది. అమాయకంగా కనిపించే ఆమె పేరు కాంతి. వరంగల్ జిల్లా వర్థన్నపేట సమీపంలోని భవానికుంట తండాకు చెందిన ఈమెకు జాటోత్ బాలాజీతో వివాహం…
Murder: బెలగావి జిల్లా రామదుర్గ తాలూకాలోని ఖాన్పేట్ సమీపంలో జూలై 7న ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడిన స్థితిలో మృతదేహం గుర్తించబడింది. మెడకు టవల్‌తో బిగించి, మర్మాంగంపై దాడి చేసి, తలపై కండరంతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసిన రామదుర్గ పోలీసులు, మృతుడిని ధారవాడ అమ్మినబావి గ్రామానికి చెందిన ఈరప్ప ఆడిన్గా గుర్తించారు. కేసును లోతుగా విచారించగా, హత్య వెనుక హృదయాన్ని కలచివేసే కుటుంబ రహస్యాలు వెలుగులోకి…
Tragic : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. మొదట్లో రోడ్డు ప్రమాదంగా అనుమానించిన కేసు.. చివరకు ప్రేమ వ్యవహారంతో జరిగిన హత్యగా తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ రోజు ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఒక ద్విచక్ర వాహనాన్ని కార్ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని స్వామిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సంఘటన…
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భార్యలు, భర్తలను చంపుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? భర్తలను చంపి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది ఓ భార్య ఈ ఘటన ఉన్నావ్ లో చోటుచేసుకుంది. జాజ్మౌ ప్రాంతంలోని ఇఖ్లాక్ నగర్లో నివసిస్తున్న ఇమ్రాన్ అలియాస్ కాలేను అతని…
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు కొందరు భార్యలు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ, ప్రియుడితో కలిసి మంచం పట్టిన భర్తను దిండుతో గొంతు నులిమి హత్య చేసి, దానిని సహజ మరణంలా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిశా రామ్టేకే (30), చంద్రసేన్ రామ్టేకే (38) 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.…
ప్రియుడితో మాట్లాడొద్దని హెచ్చరించినందుకు ఏకంగా భర్తను హతమార్చిందో భార్యామణి !! మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతునులిమి చంపడమే కాకుండా... ఆత్మహత్యగా చిత్రీకరించింది !! బంధువులనూ నమ్మించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. ఒక్క చిన్న క్లూ.. భార్య ఆడిన నాటకాన్ని బయటపెట్టింది !! ఇంతకూ ఎవరా కిరాతక భార్యామణి..? ప్రియురాలి డ్రామా వెనకున్న ప్రియుడు ఎవరు..?
ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది.
వామ్మో.. రోజురోజుకు మహిళల అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. మొన్నటికి మొన్న హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి అత్యంత దారుణంగా సోనమ్ రఘువంశీ అనే నవ వధువు చంపేసింది. ఈ దుర్ఘటనను దేశ ప్రజలంతా ఇంకా మరిచిపోలేదు. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.