Aus Vs Eng: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆ జట్టును 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. విచిత్రం ఏంటంటే ఈ సిరీస్‌లో ఆడుతోంది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టేనా అని చాలా మందికి అనుమానం వచ్చింది. అంత ఘోరంగా ఈ వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా మూడో వన్డేలో ఇంగ్లండ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.…
పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఇది నిజంగా చేదువార్తే. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన చోట బంగ్లాదేశ్ మాత్రం చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయం సాధించింది. బుధవారం రాత్రి సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్…