Terrorist Encounter: జమ్మూ కాశ్మీర్‌లో వాతావరణ విధ్వంసం కారణంగా ప్రతిచోటా జనజీవనం అస్తవ్యస్తమైంది. అకాల వర్షాలతో, అనుకూలంగా లేని వాతావరణాన్ని ఉగ్రవాదులు ఆసరాగా చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి ప్రతి ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టర్ పరిధిలోని LOC లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు భగ్నం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్‌గా చేసుకొని సోమవారం ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తుండగా భారత…
సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది.
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.…