USA: అమెరికా డెలావర్‌లో జరగబోయే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి ‘‘క్వాడ్ ’’ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ బయలుదేరాడు. అయితే, అమెరికాలో మోడీ అడుగుపెట్టే కొన్ని గంటల ముందు వైట్‌హౌజ్ అధికారులు ఖలిస్తానీ మద్దతు గ్రూపులతో సమావేశమైంది. ‘‘అమెరికా గడ్డపై ఏదైనా అంతర్జాతీయ దురాక్రమణ నుంచి రక్షణ’’ ఇస్తామని సదరు సిక్కు గ్రూపులకు వైట్‌హౌజ్ అధికారుల నుంచి హామీ వచ్చింది. అమెరిలో ఉన్నప్పుడు అమెరికన్ పౌరులను హాని నుంచి రక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.