రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను…