ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఖాళీగా పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో పలువురు నేతలను నియమించిన కూటమి సర్కార్.. తాజాగా శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను నియమించింది. శాసనసభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కింది. శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.