వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇప్పుడు రానుంది. వాట్సాప్ వెబ్‌లోనే గ్రూప్ వీడియో కాల్స్, గ్రూప్ ఆడియో కాల్స్ చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇప్పటివరకు ఈ సౌకర్యం వాట్సాప్ విండోస్ యాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇకపై వెబ్ బ్రౌజర్ నుంచే కాల్స్ చేయవచ్చు. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్‌డేట్‌లపై సమాచారం అందించే ప్రముఖ వెబ్‌సైట్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో గ్రూప్…