పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మరోషాక్ తగిలింది. ఆపార్టీ అసన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల తరువాత బాబూలాల్ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. అయితే, ఈనెలలో బెంగాల్లో మూడు అసెంబ్లీ…
బెంగాల్‌లోని భవానీ పూర్ నియోజకవర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక పోటీ చేస్తున్నారు. ఇక సీపీఐ నుంచి శ్రీజివ్ బిశ్వాస్ బరిలో ఉన్నారు. నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మమతా బెనర్జీ తన సొంత నియోజక వర్గం భవానీపూర్ నుంచి బరిలో దిగారు. అమె విజయం నల్లేరుపై నడకే అని చెప్పొచ్చు. అయిన్పటికి బీజేపీ…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా నిలదొక్కుకున్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. కరోనా ఎలా వస్తుంది. దాని వలన వచ్చే ఇబ్బందులు ఎంటి? కరోనా అంటే ఎంటి… ఎలా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది… క్వారంటైన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను విద్యార్థులకు బోధించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్దమైంది. 11 వ తరగతిలోని హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లో పాఠ్యాంశంగా బోధించనునన్నారు. 11 వ తరగతికి…
ఉత్తర భారతదేశంలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చేనెలలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జరగబోతున్న ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీపై ప్రియాంకను రంగంలోకి దించుతోంది బీజేపీ. లాయర్‌గా ఆమెకు కోల్‌కతాలో మంచిపేరు ఉన్నది. డేరింగ్ విమెన్‌గా ఆమెకు అక్కడ పేరు ఉన్నది. 2021 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు…
త్వరలోనే బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో భవానీపూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేయగా, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆయనపై పోటీకి నిలబడింది. గతంలో సువేందు అధికారి ఈ నియోజక వర్గం నుంచి తృణమూల్ పార్టీ నుంచి పోటీ చేసి…
ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా కలిసిరావు. ముఖ్యంగా రాజకీయాలకు ఇది అసలు సూట్ కాదు. కొన్నిసార్లు తాత్కాలికంగా పని చేసినట్లు కన్పించినా దాని ప్రభావం దీర్ఘకాలంలో ఉంటుందని రుజువైన సంఘటనలు అనేకం ఉన్నాయి. మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ ఆ పార్టీకి ఒక్క విషయంలో మాత్రం ఆనందం లేకుండా పోయింది. అది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పరాజయం…
భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా…
పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ ఉప ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జి భవానీపూర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇక షంషేర్ గంజ్ నుంచి అమీరుల్ ఇస్లాం, జాంగీర్‌పూర్ నుంచి జాకీర్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న మూడు నియోజకవర్గాలకు… సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. కాగా.. మూడు రోజుల క్రితమే ఈ ఎన్నికల షెడ్యూల్ ను…
ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లుకు సంబందించి ఎన్నికన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే హడావుడి మొదలైంది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మమతా బెనర్జీ తన పాత నియోజక వర్గమైన భాబినీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గం…
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.. అందులో భాగంగా.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.. అయితే, కరోనా నేపథ్యంలో.. 11 రాష్ట్రాలు ఇప్పుడే ఎన్నికలు వద్దని ఎన్నికల సంఘాన్ని కోరాయి.. దీంతో.. ఆ 11 రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం… పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి బైపోల్ నిర్వహించనున్నారు.. పశ్చిమ…