Crime: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నార్త్ 24 పరగణాల జిల్లాలోని హస్నాబాద్‌లో వైద్యం కోసం వచ్చి మహిళా పేషెంట్‌పై డాక్టర్ అత్యాచారం చేశాడు. యాంగ్జైటీ, టెన్షన్ పరిస్థితుల్లో మాససిక ప్రశాంతత కోసం ఇచ్చే ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానిక ఒడిగట్టాడు. ఈ కేసులో సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తూర్పు మేదినిపూర్‌లో ఓ నిందితుడు పొరుగించిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలిని పటాష్‌పూర్‌లోని నిందితుడి పక్కింటిలో ఉన్న మహిళగా గుర్తించారు. ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బలవంతంగా విషం తాగించాడు.