Demand for Hotel rooms: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి 2 నెలల్లో దేశంలోని హోటల్ రూములకు భారీ గిరాకీ నెలకొంటుందని యజమానులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లు, కార్పొరేట్ ప్రయాణాలు ఎక్కువ జరగనుండటంతో హోటళ్లకు డిమాండ్ పెరగనుందని ఆశిస్తున్నారు. ఈ సంవత్సరంలోని జనవరి నెలలో లీజర్ మరియు కార్పొరేట్ ట్రావెల్స్ గణనీయంగా వృద్ధి చెందాయి. మేజర్ మెట్రో సిటీల్లో మరియు టియర్-2, టియర్-3 మార్కెట్లలో కార్పొరేట్ ప్రయాణాలు పీక్ స్టేజ్‌లో జరుగుతున్నాయి.