Temperatures in Telangana: తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఎల్లుండికి తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది.
హైదరాబాద్ నగరంలో ఒక గంట నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది.. ఇక, నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతుంది.
తూర్పు అమెరికా రాష్ట్రాలను తుఫాను వణికిస్తుంది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే ప్రమాద ఘటనల్లో ఇద్దరు మరణించారు. ఇప్పటికే వందల విమానాలను రద్దు చేశారు. వేలాది విమానాలు లేట్ గా నడుస్తున్నాయి. 11 లక్షలకు పైగా ఇళ్లు, వాణిజ్య కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, జోగులంబా గద్వాల్, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్ పడుతుందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరానికి చేరుకునే అతి తీవ్రమైన తుఫాను ‘మోచా’తో దేశంలోని తీర ప్రాంతాలు, ఓడరేవులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మూడు ఓడరేవులు, 12 జిల్లాలకు భారీ ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాద హెచ్చరిక నం.8ను దేశ వాతావరణ కార్యాలయం జారీ చేసింది.