అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్‌లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది.
Water Tank Collapse: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈరోజు (అక్టోబర్ 24) పెను ప్రమాదం సంభవించింది. పింప్రి చించ్‌వాడ్ లోని భోసారి ప్రాంతంలో వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. అలాగే ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కార్మికులందరూ బీహార్, జార్ఖండ్ వాసులు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై అదనపు పోలీసు కమిషనర్ వసంత్ పరదేశి స్పందించారు. ఓ నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు…