ఆ ఊరు ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఎటువంటి సదుపాయాలకు నోచుకోలేదు. కనీసం నిత్యవసరం అయిన నీరు కూడా ఆ గ్రామస్తులకు అందడం లేదు. ఏదో ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. అది కూడా కేవలం 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. వాటినే వారు మూడు రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే కుటుంబం…
కేటీఆర్ అంకుల్.. మా కాలనీకి 5 సంవత్సరాలు నీళ్లు రావటంలేదు. మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ అంకుల్ మాకు సాయం చేయండి.." అని రాసుంది. ఆ వీడియోను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ఎక్కడో ఢిల్లీలోనో, హైదరాబాద్ గాంధీభవన్ లోనో కూర్చుని మాటలు మాట్లాడుతున్న నేతలకు తెలంగాణలో నీళ్లు అందుతున్నాయా? లేదా ? అనే విషయం వాళ్లకేం తెలుసని ప్రశ్నించారు.
ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్సును సందర్శించిన కేంద్ర మంత్రి భారతీ పవార్.. అక్కడ అందుతోన్న సేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. మందులు అందుతున్నాయా..? లేదా అంటూ రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి పవార్. జనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా..? లేవా..? అంటూ ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు గురించి కేంద్ర మంత్రి అడిగారు. అయితే, ఆయుష్మాన్…
వేసవి వచ్చేసింది. మండే ఎండలకు తోడు నీటి కొరత జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో…గుక్కెడు నీటి కోసం జనం అలాడిపోతున్నారు. తాగునీటి సరఫరాలో నీటివనరులు, లేదా సాంకేతిక సమస్యలు ఉంటే ట్యాంకర్లతో అయినా సరఫరా చేస్తారు. ఈ నియోజకర్గంలో ఆధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో క్యాను నీటికి 15 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ…
హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈనెల 29, 30 తేదీల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. మంజీరా ఫేజ్-2 పైపులైన్‌లకు మరమ్మతులు నిర్వహిస్తున్న కారణంగా నీటి సరఫరా బంద్ కానుందని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్ చెరువు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్‌పీ పంపింగ్ పైప్‌లైనుకు సంబంధించి వివిధ ప్రాంతాలలో లీకేజీలను నివారించేందుకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల…