జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ బొగ్గు గనిలో పెను ప్రమాదం తప్పింది. ఫస్ట్ షిఫ్ట్ లోని 11 డీపీ వద్ద భారీగా చేరింది నీరు. దీంతో నీటిలో మునిగాయి 150 హెచ్ పి మోటార్లు. హుటాహుటిన సంఘటనా స్థలం నుంచి పైకి వచ్చారు కార్మికులు. దీంతో విద్యుద్ఘాతం నుంచి తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కో మోటారు రూ.50 లక్షల విలువ చేస్తాయని, సింగరేణికి రూ.1కోటి రూపాయల నష్టం…
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే భయం భయంగా వుంది. బయటకు రాలేక, జీవనం గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాల కారణంగా చివరి మజిలీకి తిప్పలు తప్పడంలేదు. చెన్నై లో చనిపోయిన వ్యక్తిని ట్రాక్టరు ద్వారా తీసుకెళుతున్నారు కుటుంబ సభ్యులు. సౌత్ చెన్నైలో చోటు చేసుకున్న ఘటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ వర్షాల కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో మరణించిన…
భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం,…
భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని ఊర్లన్నీ చెరువుల్లా మారాయి. తిరుపతిలో గ్రామాల మధ్య వివాదంగా మారింది రాయలచెరువు. గండి కొట్టాలని ఒకవైపు గ్రామస్థులు….గండి కొట్టకూడదని మరో వైపు గ్రామస్థులు అంటున్నారు. చెరువుకు అవుట్ ప్లో కంటే ఇన్ ప్లో ఎక్కువగా వుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి, తమను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురి కావడంతో…
తిరుమల భారీవర్షానికి భారీగా నష్టపోయింది. టీటీడీకి చెందిన అనేక ఆస్తులు ధ్వంసం అయ్యాయి. మెట్ల మార్గంలో వరద ఉద్ధృతి కారణంగా మెట్లు పాడయ్యాయి. భక్తులు నడిచి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయగా అవన్నీ వరదలలో కొట్టుకుపోయాయి. శ్రీవారి మెట్టు నడకమార్గంలో అనేక ప్రాంతాలో ధ్వంసమయ్యాయి మెట్లు. 500,600,800 మెట్ల వద్ద వరద ప్రవాహానికి కోతకు గురైంది మెట్ల మార్గం. మరమ్మతు పనులుకు వారంరోజులు సమయం పట్టే అవకాశం వుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో…
వాన కష్టాలు మాజీ సీఎం చంద్రబాబునాయుడిని వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచెత్తింది భారీ వరద నీరు. ఇంటి వెనుక పొలాలపై నుంచి వచ్చిన వరద ఇంటిని చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బంది గదితో పాటు ఉద్యానవనం మునిగిపోయింది. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు సాయంతో నీరు బయటకు పంపిస్తున్నారు.భారీవర్షం కారణంగా రేపు టీటీడీ…
భారీవర్షానికి చిత్తూరు జిల్లా వణికిపోతోంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం లో 79.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మధురానగరిలో వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది. ఈ భారీ వర్షానికి జంగాలపల్లి పాపిరెడ్డి పల్లి యు. ఎం పురం, పాతపాలెం జిఎంఆర్ పురం లో నీరు పొంగి పొరలడంతో వాగులు దాటలేక , పాఠశాల విద్యార్థులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జంగాలపల్లె వాగు దాటలేక ఓ ఇంటి వద్ద ,ఓ ప్రైవేట్…
వర్షాలు, వరదలతో చెన్నై ప్రజలు అల్లాడిపోతున్నారు. నేనున్నాను.. మీకేం కాదంటూ సీఎం స్టాలిన్ అభయం ఇస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని పలకరిస్తూనే వరద నీటిలోనే ఆయన ముందుకుసాగుతున్నారు.
భారీ వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహం పెరగడంతో పుజల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో నీరు పరవళ్ళు తొక్కుతోంది.…
అల్పపీడనం,భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లా తడిసిముద్దవుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో ప్రజలు అల్లాడుతున్నారు.నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి,సూళ్లూరుపేట,వేలాది గ్రామాల్లో ప్రజలు అసలు రోడ్ల పై నడవలేనంతగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లు దారుణంగా పాడైపోయాయి. నెల్లూరు నగరంలో చాలా చోట్ల నీరు చేరి నిలిచిపోయింది. దీంతో వాహనాలు రోడ్ల పై తిరగలేక,అండర్ బ్రిడ్జిల కింద ఇరుక్కుపోతున్నాయి. ప్రభుత్వం,అధికారులు తమ ఇక్కట్లు, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…