హైదరాబాద్ లో మరోసారి భారీగా కురుస్తోంది వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్‌పేట్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్‌పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. రుతుపవనాల ప్రవేశంతో బుధవారం నాడు…
మండువేసవిలో భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం కావడం మనం చూశాం. తాజాగా కురిసిన వర్షం కారణంగా కాలనీలు చిన్నపాటి చెరువులను తలపించాయి. హైదరాబాద్ లో కురిసిన భారీవర్షానికి బోట్లను వినియోగించడం కనిపించింది. పాతబస్తీ బాబా నగర్ లో యువకులు కొందరు బోట్లతో షికారు చేస్తూ కనిపించారు.హైదరాబాద్ బోట్ల వినియోగం గతంలోనూ కనిపించింది. వర్షాకాలం వస్తే బోట్లు అందుబాటులోకి తేవాలని కాలనీ వాసులు గతంలో కోరిన సందర్భాలున్నాయి. ఒకవైపు కాలనీల్లో…