IND Vs ZIM: ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమైంది. ఆగస్టు 10న ఓల్డ్ ట్రాఫోర్డులో లాంక్షైర్కు ఆడుతూ ఓ మ్యాచ్‌లో డైవ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు జింబాబ్వే టూర్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం సుందర్ రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని…
ఐపీఎల్లో వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి గాయపడటంతో తర్వాతి మ్యాచ్‌లో అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. గతంలో సుందర్‌కు గాయమైన కుడి చేతికే మరోసారి గాయమైందని తెలిపాడు. గాయం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండానే మైదానాన్ని విడిచివెళ్లాడు. కాగా టోర్నీ ప్రారంభంలో…
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భారత జట్టు వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఈనెల 12న కేప్ టౌన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇతర సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు…
కరోనా కారణంగా మధ్యలో వాయిదా పడిన ఐపీఎల్ 2021 త్వరలోనే యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే ఇదే ఊపును సెకండ్ హాఫ్ లో కూడా ప్రదర్శించి ఐపీఎల్ టైటిల్ అందుకోవాలని అనుకుంటున్న ఆర్సీబీ జట్టుకు షాక్ తగిలింది. మిగిలిన ఐపీఎల్ 2021 సీజన్ కు…