Arshdeep Singh: టీ20ల్లో అర్ష్‌దీప్ చెత్త రికార్డ్.. అదే కొంపముంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Worst Record In T20I: గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడో అందరికీ తెలుసు. ఆ మెగా టోర్నీలో భారత్ సెమీఫైనల్స్ దాకా వెళ్లడంలో అతని పాత్ర అత్యంత కీలకమని చెప్పుకోవడంలో సందేహమే లేదు. బౌలింగ్ పవర్‌ప్లే, డెత్ ఓవర్స్‌లలో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించాడు. అలాంటి అర్ష్‌దీప్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా 22 మ్యాచ్‌ల్లో అతడు ఏకంగా 14 నో బాల్స్ వేశాడు. అతని తర్వాత 11 నో బాల్స్‌తో పాకిస్థాన్‌కు చెందిన హసన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలావుండగా.. రాంచీలో శుక్రవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచాడు. చివరి ఓవర్‌లో అతడు ఏకంగా 27 పరుగులు ఇచ్చేశాడు. మరో విషయం ఏమిటంటే.. ఈ ఓవర్‌లోని తొలి బంతికి కూడా అతడు నో బాల్ వేశాడు. దీంతో.. నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోశారు. చివరి ఓవర్ వేయాల్సింది ఇలాగేనా? అంటూ అతనిపై మండిపడ్డారు. ఇప్పటికీ అతడ్ని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.
Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం
Also Read
- IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే, డేరిల్ మిచెల్ అర్థశతకాలతో మెరువడంతో.. కివీస్ జట్టు ఆ స్థాయిలో పరుగులు చేయగలిగింది. 177 పరుగులతో బరిలోకి దిగిన టీమిండియా.. అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచి, 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాపార్డర్ ఘోరంగా ఫ్లాప్ అవ్వడం.. సూర్యకుమార్ (47), వాషింగ్టన్ సుందర్ (50) మినహా మిగతా బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో, భారత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ గెలవాలంటే.. భారత్ మిగిలిన రెండు మ్యాచెస్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.
Kamal Haasan: కమల్ హాసన్ పార్టీ వెబ్‌సైట్ హ్యాక్.. ఎంత పని చేశారో తెలుసా?
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?