AP Govt : త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు (ఫిబ్రవరి 17) గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే వారు ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇది ఊహించని పరిణామం. బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబర్ జీతంలో 10 నుంచి 50శాతం వరకు తగ్గించారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్22 వరకు హాజరు డాటా ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలి. కానీ బయోమెట్రిక్ మెషీన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకుండా తమ జీతాల్లో కోత విధించడమేంటని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా…