గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్‌లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్‌కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్‌ఎస్‌కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే…