ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా యుద్దోన్మాదంతో రెచ్చిపోతున్న రష్యా, అనూహ్యంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై వార్‌లో తొలి దశ ముగిసిందని తెలిపింది. ఇక తూర్పు డాన్ బాస్ ప్రాంతాలపై దృష్టిసారిస్తామని రష్యన్ మిలటరీ ప్రకటించింది. డొంటెస్క్, లుహాంస్క్ లలో రష్యా అనుకూల తిరుగుబాటు దారుల ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. పూర్తిస్తాయిలో వీటిని ఆక్రమించేందుకు వ్యూహం మార్చింది మాస్కో. ఉక్రెయిన్ ప్రతిఘటనతో విసిరివేసారుతున్న రష్యన్ మిలటరీ, చిన్నచిన్న లక్ష్యాల వైపు అడుగులెయ్యాలని వ్యూహం మారుస్తున్నట్టు కనపడుతోంది.…